Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:27 PM

వెలిమినేడు నొష్ ల్యాబ్స్ ముందు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా

02-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్దగల నొష్ ల్యాబ్స్ లో జరిగిన విషాదకర ప్రమాదం ఉద్రిక్తతకు దారి తీసింది. నిన్న చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు ధర్నాకు దిగారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. సంస్థ చుట్టూ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం ద్వారా బాధితుల సమస్యలను దాటవేయాలని యాజమాన్యం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

మృతుడి కుటుంబానికి కనీసం ఒక కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం స్పందించి బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, సంఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

Sthanikam

వెలిమినేడు నొష్ ల్యాబ్స్ ముందు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్దగల నొష్ ల్యాబ్స్ లో జరిగిన విషాదకర ప్రమాదం ఉద్రిక్తతకు దారి తీసింది. నిన్న చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు ధర్నాకు దిగారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. సంస్థ చుట్టూ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం ద్వారా బాధితుల సమస్యలను దాటవేయాలని యాజమాన్యం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

మృతుడి కుటుంబానికి కనీసం ఒక కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం స్పందించి బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, సంఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News