Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

వెల్లంకిలో విషాదం.. బాధిత కుటుంబాలకు సహాయం

02-05-2026 105 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పద్మశాలి కుటుంబాల వారు ఈపూరి సత్యనారాయణ, మిర్యాల బాలరాజు అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, కొండా లక్ష్మణ్ బాపూజీ సేవా సంస్థ చైర్మన్ బర్రింకల మధుసూదన్‌లకు సమాచారం అందించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి పిల్లలకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించాలని కోరారు.

దీనికి స్పందించిన సంఘం నాయకులు బాధిత కుటుంబాలైన ఈపూరి సునీత, మిర్యాల అంజలి వారికి రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి పిల్లలకు భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ విషయమై చొరవ చూపిన అఖిలభారత పద్మశాలి సంఘం వర్కింగ్ కమిటీ సభ్యులు ఇడం శ్రీనివాస్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

వెల్లంకిలో విషాదం.. బాధిత కుటుంబాలకు సహాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News