Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా

వెంకటయ్య అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు

Updated : 17 Jan 2026 19:12 IST
As Preferred Source 1 min read
వెంకటయ్య అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:మహబూబాబాద్ జిల్లా గాంధీపురం గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో ఈ నెల 05వ తేదీ జనవరి నాడు మరణించిన గుండ మాల వెంకటయ్య కుటుంబాన్ని మదర్ తెరిసా విద్యాభ్యాస కళాశాల ఉపాధ్యాయులు పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఎన్నో సంవత్సరాలుగా అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా, అంకితభావంతో సేవలు అందించిన వెంకటయ్య మరణం అత్యంత బాధాకరమని మానవ హక్కులు, సామాజిక న్యాయం, సామాజిక సేవ మార్పు కోసం పనిచేస్తున్న సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, వెంకటయ్య నిరాడంబరమైన జీవితం గడుపుతూ, తన విధుల పట్ల నిబద్ధతతో అందరి అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి అకాల మరణం యాజమాన్యానికి, సహోద్యోగులకు, గ్రామ ప్రజలకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.ఎన్నో సంవత్సరాలుగా అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా, అంకితభావంతో సేవలు అందించిన వెంకటయ్య మరణం అత్యంత బాధాకరమని మానవ హక్కులు,సామాజిక న్యాయం,సామాజిక సేవ మార్పు కోసం పనిచేస్తున్న సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ అన్నారు.ఆయన మాట్లాడుతూ, వెంకటయ్య నిరాడంబరమైన జీవితం గడుపుతూ, తన విధుల పట్ల నిబద్ధతతో అందరి అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి అకాల మరణం యాజమాన్యానికి, సహోద్యోగులకు, గ్రామ ప్రజలకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.కే. వీరయ్య, వీరభద్రం, జైపాల్ రెడ్డి, రాజేష్, కవిత, భిక్షం తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే వెంకటయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Sthanikam

వెంకటయ్య అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news