Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

వీధి కుక్కల నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలి: సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ

27-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి పట్టణంలో వీధి కుక్కలు,కోతుల సమస్య తీవ్రంగా మారిందని సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య మాట్లాడుతూ,ప్రతి కాలనీలో వీధి కుక్కలు మరియు కోతుల బెడద పెరిగి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.పాలకులు,అధికారులు పట్టణ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వచ్చినప్పటికీ,వాటిని సరైన విధంగా వినియోగించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.ఎన్నికల ముందు నాయకులు వీధి కుక్కల సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.కుక్కలు, కోతుల సంతానోత్పత్తిని నియంత్రించేందుకు టీకాలు వేయడం,కరిచిన వారికి తక్షణ వైద్యం అందించడం వంటి చర్యలు తీసుకోవాలని సిపిఐఎం పట్టణ కమిటీ డిమాండ్ చేసింది.ఇటీవల కుక్క దాడిలో గాయపడి చూపు కోల్పోయిన బాలుడికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని,అతనికి మంచి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యను అందించాలని కోరారు.వారం రోజుల్లో వీధి కుక్కలు,కోతులను పట్టణంలోని ప్రధాన వీధుల నుంచి తొలగించాలని,తారకరామ నగర్,ఆర్‌బి నగర్ ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

వీధి కుక్కల నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలి: సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News