Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

వ్యవసాయానికి 10% బడ్జెట్ కేటాయించాలి – ముసునూరులో రైతుల గళమెత్తింపు

24-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముసునూరులో తహసీల్దార్‌కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతిపత్రం

ముసునూరు : ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి గత సంవత్సరం కంటే తక్కువ కేటాయింపులు చేసినట్లు పేర్కొంటూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి కనీసం 10 శాతం బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ముసునూరు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు సహా అన్ని రకాల సబ్సిడీలను కొనసాగించాలని రైతు సంఘం నేతలు కోరారు. ఎరువులు, విత్తనాలు, విద్యుత్, సాగునీటి సదుపాయాలపై సబ్సిడీలు తగ్గించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, కూచిపూడి నాగేశ్వరరావు, మన్మధరావు, చంగల వెంకటేశ్వరరావు, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడు వేముల బక్కయ్య, పల్లెపాము భవాని తదితర రైతులు పాల్గొన్నారు. రైతుల సమక్షంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సంఘం నేతలు హెచ్చరించారు.

Sthanikam

వ్యవసాయానికి 10% బడ్జెట్ కేటాయించాలి – ముసునూరులో రైతుల గళమెత్తింపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News