Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:40 PM

వ్యవసాయాభివృద్ధికి కీలక అడుగు – ఖేఢ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

31-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం వసర్ గ్రామంలో నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన “వసర్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్” నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు, భూమి సంరక్షణ మరియు వ్యవసాయ అభివృద్ధికి వాటర్ షెడ్ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వసర్ మరియు పరిసర ప్రాంతాల రైతులకు గణనీయమైన మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యాలయం ద్వారా వాటర్ షెడ్ పనులను పర్యవేక్షిస్తూ రైతులకు సాంకేతిక సూచనలు, అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ అధికారులు దండం కృష్ణ తేజ, ఆర్‌ఓ రాధ రాణి, ఏడీఏ నూతన్ కుమార్, ఎన్‌జీవో చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ హన్మంత్, ఉప సర్పంచ్ విఠల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యవసాయాభివృద్ధికి కీలక అడుగు – ఖేఢ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News