Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

వ్యవసాయ రంగ బలోపేతానికి డీలర్లకు డిప్లమో శిక్షణ ప్రారంభించిన:జిల్లా కలెక్టర్

19-02-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వ్యవసాయ రంగంలో డీలర్ల సామర్థ్యవృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న “డిప్లమో ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్” కార్యక్రమం గురువారం పాత డిఆర్డిఏ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు.వ్యవసాయ శాఖలో ఏఈవోలు, ఏవోలు వంటి సిబ్బంది ఉన్నప్పటికీ ప్రతి రైతు వరకు సమగ్ర అవగాహన చేరడానికి పారా ఎక్స్టెన్షన్ పర్సనల్ పాత్ర కీలకమని పేర్కొన్నారు.ఇన్‌పుట్ డీలర్లు వ్యవసాయ రంగంలో కీలక సలహాదారులుగా వ్యవహరించగలరని, ఈ డిప్లమో కార్యక్రమం ద్వారా వారి పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.కార్యక్రమానికి స్వచ్ఛందంగా నమోదు చేసుకుని ముందుకు వచ్చిన డీలర్లను అభినందిస్తూ, 48 సెక్షన్లలో ట్రైనర్లు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అన్ని సెషన్లను క్రమంగా హాజరై, వినడంతో పాటు పరస్పర చర్చల ద్వారా మరింత జ్ఞానం సంపాదించుకోవాలని సూచించారు.రైతులకు నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించడం, నానో వ్యవసాయ సాంకేతికతలను విస్తరించడం, కొత్త వంగడాలు, కొత్త పంట రకాలు, ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటలపై సరైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. రైతులు తమ సందేహాల నివృత్తి కోసం ముందుగా డీలర్లను సంప్రదిస్తారని, అందువల్ల ముందస్తు పరిజ్ఞానం కలిగి ఉండటం ద్వారా రైతులకు సముచిత సలహాలు, సూచనలు ఇవ్వగలరని అన్నారు. తద్వారా లాభదాయక పంటల సాగు వైపు రైతులను దారితీసే అవకాశం ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, డీలర్లు, ట్రైనర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యవసాయ రంగ బలోపేతానికి డీలర్లకు డిప్లమో శిక్షణ ప్రారంభించిన:జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News