Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:22 AM

వ్యవసాయ కార్మిక సంఘం సభను జయప్రదం చేయాలి

15-05-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభల సందర్భంగా ఈనెల 18న రామన్నపేటలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కందుల హనుమంతు, కార్యదర్శి మేడి ముకుంద మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేక పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిందన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఈ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఫోటో క్యాప్షన్ విధానంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా పని దొరకక వెనుదిరిగే పరిస్థితి నెలకొందన్నారు. పనిచేసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈనెల 18న జరిగే మహాసభల బహిరంగ సభకు ఆల్ ఇండియా కార్యదర్శి బి. వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్రాములు హాజరవుతారని తెలిపారు. వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

కార్యక్రమంలో వేముల సైదులు, కన్నెబోయిన యాదయ్య, నీల సంతోష్, మమత, నాగమణి, పార్వతమ్మ, అండాలు, రాధ, కల్పన, లక్ష్మి, కవిత, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యవసాయ కార్మిక సంఘం సభను జయప్రదం చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News