Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:28 AM

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలి.ఉపాధి కూలీల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం. సిపిఎం

14-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ఈనెల 18, 19 తేదీల్లో రామన్నపేటలో నిర్వహించనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని సంఘం మండల అధ్యక్షుడు మేడి ముకుంద, కార్యదర్శి కందుల హనుమంతు పిలుపునిచ్చారు.

కొమ్మాయిగూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీల పని ప్రదేశంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని, ఎండల తీవ్రత దృష్ట్యా నీడ, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు రామన్నపేటలో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో కూలీలు పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఎర్ర అలివేలు, కార్యదర్శిగా శానగొండ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఎర్ర కమలమ్మ, బుర్ర పుష్ప, సహాయ కార్యదర్శులుగా దగ్గుల మారమ్మ, గురుజాల సునీత, కొండగడప అన్నపూర్ణ, కోణాల నరసమ్మ, పోషబోయిన మమత ఎన్నికయ్యారు.

కార్యక్రమంలో శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు

Sthanikam

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలి.ఉపాధి కూలీల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం. సిపిఎం

Article Image

రామన్నపేట,

ఈనెల 18, 19 తేదీల్లో రామన్నపేటలో నిర్వహించనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని సంఘం మండల అధ్యక్షుడు మేడి ముకుంద, కార్యదర్శి కందుల హనుమంతు పిలుపునిచ్చారు.

కొమ్మాయిగూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీల పని ప్రదేశంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని, ఎండల తీవ్రత దృష్ట్యా నీడ, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు రామన్నపేటలో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో కూలీలు పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఎర్ర అలివేలు, కార్యదర్శిగా శానగొండ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఎర్ర కమలమ్మ, బుర్ర పుష్ప, సహాయ కార్యదర్శులుగా దగ్గుల మారమ్మ, గురుజాల సునీత, కొండగడప అన్నపూర్ణ, కోణాల నరసమ్మ, పోషబోయిన మమత ఎన్నికయ్యారు.

కార్యక్రమంలో శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News