Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:26 AM

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు పిలుపు

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు పిలుపు

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు పిలుపు
17-05-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ కోరారు. మే 18, 19 తేదీల్లో రామన్నపేట మండల కేంద్రంలో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గత మూడున్నరేళ్లుగా జిల్లాలో వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్‌బుక్లు ఇవ్వడం, భూ పంపిణీ నిషేధం ఎత్తివేయడం, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడం వంటి అంశాలపై ఉద్యమాలు చేపట్టినట్లు తెలిపారు.

ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించామని చెప్పారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, విద్య, వైద్యం, ఉపాధి హక్కులను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 18న సాయంత్రం రామన్నపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.

19వ తేదీన జరిగే ప్రతినిధుల మహాసభకు జిల్లా నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని నర్సింహ కోరారు.

Sthanikam

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News