Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:17 AM

వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి

వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి

వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
22-01-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన తీన్మార్ మల్లన్న

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. యూనివర్సిటీ అధికారులు తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం పలికారు.అనంతరం యూనివర్సిటీ అధికారులు, సిబ్బందితో కలిసి తీన్మార్ మల్లన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యా రంగం, పరిశోధన కార్యకలాపాలు, మౌలిక వసతులు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై అధికారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు వివరించిన సమస్యలను శ్రద్ధగా విన్న తీన్మార్ మల్లన్న, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.రాష్ట్రంలో రైతు, వ్యవసాయం, వ్యవసాయ విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల బలోపేతమే రైతుల అభివృద్ధికి పునాది అని తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Sthanikam

వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News