Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:47 AM

వాతావరణ సమతుల్యానికి చెట్ల పెంపకం అవసరం చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు

12-03-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి: వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే చెట్ల పెంపకం అత్యంత అవసరమని చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గురువారం ఉదయం చనుబండ పెద్ద చెరువు కట్ట వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్ద చెరువు కట్టకు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ “వృక్షో రక్షతి రక్షితః” అనే సూక్తిని ప్రస్తావిస్తూ మనం చెట్లను కాపాడితే అవే మనలను కాపాడతాయని తెలిపారు. ప్రస్తుతం విచ్చలవిడిగా అడవులు, చెట్లు నరికివేయడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు. దీని ఫలితంగా వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, చలితీవ్రత అధికమవడం వంటి అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం మానవుల తక్షణ కర్తవ్యమని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, ఫీల్డ్ అసిస్టెంట్ కొండా తాతయ్యబాబు, పెద్ద చెరువు నీటిసంఘం ఉపాధ్యక్షులు గవర వెంకటేశ్వరరావు, బుస్సు తిరుపతయ్య, కళ్ళేపల్లి మారేశ్వరరావు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Sthanikam

వాతావరణ సమతుల్యానికి చెట్ల పెంపకం అవసరం చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు

Article Image

చాట్రాయి: వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే చెట్ల పెంపకం అత్యంత అవసరమని చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గురువారం ఉదయం చనుబండ పెద్ద చెరువు కట్ట వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్ద చెరువు కట్టకు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ “వృక్షో రక్షతి రక్షితః” అనే సూక్తిని ప్రస్తావిస్తూ మనం చెట్లను కాపాడితే అవే మనలను కాపాడతాయని తెలిపారు. ప్రస్తుతం విచ్చలవిడిగా అడవులు, చెట్లు నరికివేయడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు. దీని ఫలితంగా వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, చలితీవ్రత అధికమవడం వంటి అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం మానవుల తక్షణ కర్తవ్యమని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, ఫీల్డ్ అసిస్టెంట్ కొండా తాతయ్యబాబు, పెద్ద చెరువు నీటిసంఘం ఉపాధ్యక్షులు గవర వెంకటేశ్వరరావు, బుస్సు తిరుపతయ్య, కళ్ళేపల్లి మారేశ్వరరావు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News