Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:09 AM

వట్ పల్లి గ్రామంలో భద్రతా చర్యలపై సర్పంచ్ ఆధ్వర్యంలో సమీక్ష

08-01-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి :వట్ పల్లి గ్రామంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీసీ కెమెరాల ఏర్పాటు అంశంపై గ్రామ నాయకులు సమీక్ష నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుద్దిరెడ్డి, మాజీ ఎంపీటీసీ లొంకల శివాజీ రావు పాల్గొని గ్రామంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు.గ్రామంలో జనసంచారం అధికంగా ఉండే ప్రధాన కూడళ్లు, పాఠశాలల పరిసరాలు,ఆలయాలు, బస్టాప్ ప్రాంతాలు,వ్యాపార కేంద్రాలు వంటి చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నాయకులు సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించడంతో పాటు అనుమానాస్పద ఘటనలపై నిఘా ఉంచడం సాధ్యమవుతుందని వారు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ లావ్ కుమార్ మాట్లాడుతూ, సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల పోలీస్ శాఖకు సహకారం పెరుగుతుందని, గ్రామంలో చట్టసువ్యవస్థలు మరింత పటిష్టంగా మారతాయని పేర్కొన్నారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన కోరారు.గ్రామాభివృద్ధితో పాటు ప్రజల భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గ్రామ సర్పంచ్ రవీందర్ తెలిపారు. గ్రామాన్ని సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

Sthanikam

వట్ పల్లి గ్రామంలో భద్రతా చర్యలపై సర్పంచ్ ఆధ్వర్యంలో సమీక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News