Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు

వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు

వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు
22-01-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

ఖాతాదారులకు స్వల్ప అసౌకర్యం… ఏటీఎం, ఆన్‌లైన్ సేవలకు ఇబ్బంది లేదు

రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు అందుబాటులో ఉండవు. జనవరి 24వ తేదీ నాలుగో శనివారం, 25వ తేదీ ఆదివారం, 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండగా, 27వ తేదీన సమ్మె కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 27న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పనిచేయవని బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి.అయితే ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఏటీఎంలు, ఆన్‌లైన్ లావాదేవీలు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. నగదు అవసరాలు ఉన్న వారు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో చెక్కుల క్లియరెన్స్, కౌంటర్ సేవలు, కొత్త ఖాతాల ప్రారంభం వంటి లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల అత్యవసర బ్యాంకు పనులను ఖాతాదారులు ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

Sthanikam

వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News