Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:25 AM

వరుస ద్విచక్ర వాహన దొంగతనాల కేసు ఛేదించిన పోలీసులు

14-05-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని సదాశివపేట పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పట్టణ పోలీసు ఇన్స్పెక్టర్ డి. వెంకటేష్ మీడియాకు తెలిపారు. ఇష్రీతాబాద్ గ్రామానికి చెందిన బలరాం సంగమేశ్వర్ అనే వ్యక్తి మద్యం మరియు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే నెలలో ఇష్రీతాబాద్ గ్రామంలో పల్సర్ వాహనం, ఆత్మకూరు గ్రామంలో గ్లామర్ వాహనం, సదాశివపేట పట్టణంలో స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని దొంగతనం చేసినట్లు విచారణలో బయటపడింది. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలను ఒప్పుకున్నాడు. అనంతరం మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కేసును ఛేదించి నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఐడి పార్టీ కానిస్టేబుళ్లు వెంకటేశం, అమానుల్లా, నహీద్ పాషా, మల్లేశంలను ఇన్స్పెక్టర్ అభినందించారు.

Sthanikam

వరుస ద్విచక్ర వాహన దొంగతనాల కేసు ఛేదించిన పోలీసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News