Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:21 AM

వరిలో అగ్గి, పాము పొడ తెగుళ్లు తీవ్రం సకాలంలో సస్యరక్షణ చేపట్టాలని వ్యవసాయ శాఖ హెచ్చరిక

23-02-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

వరిలో అగ్గి, పాము పొడ తెగుళ్లు తీవ్రం

సకాలంలో సస్యరక్షణ చేపట్టాలి

విస్సన్నపేట :

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సబ్‌డివిజన్ పరిధిలో వరిలో అగ్గి తెగులు, పాము పొడ తెగులు, జింకు లోపం లక్షణాలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సహాయ వ్యవసాయ సంచాలకులు కె. శశికళ, మండల వ్యవసాయ అధికారి షేక్ టిప్పు సుల్తాన్ మాట్లాడుతూ, జింకు లోపం నివారణకు ఎకరానికి ఒక కిలో జింక్ సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని సూచించారు.

పాము పొడ తెగులు ఉన్న పంటల్లో ఎంట్రకాల్ ఎం-45 (800 గ్రాములు) లేదా కాంటాఫ్ (200 మి.లీ.) లేదా టిల్ట్ (200 మి.లీ.) మందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు.

అగ్గి తెగులు నియంత్రణకు బీమ్ (120 గ్రాములు) లేదా మెర్జర్ (500 గ్రాములు) మందులను వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని సూచించారు. ఒకేసారి అగ్గి, పాము పొడ తెగుళ్లు ఉన్నట్లయితే కస్టోడియ (40 గ్రాములు) లేదా నాటివో (80 గ్రాములు) మందులను 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారి చేయాలని చెప్పారు.

అధిక మోతాదులో నత్రజని ఎరువులు వేయడం వల్ల తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశముందని, సిఫార్సు చేసిన మోతాదులోనే ఎరువులు వాడాలని హెచ్చరించారు. అగ్గి తెగులు సకాలంలో నియంత్రించకపోతే మెడవిరుపు దశకు చేరి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు.

రైతులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.

Sthanikam

వరిలో అగ్గి, పాము పొడ తెగుళ్లు తీవ్రం సకాలంలో సస్యరక్షణ చేపట్టాలని వ్యవసాయ శాఖ హెచ్చరిక

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News