Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:30 AM

వరికొయ్యలు తగలబెట్టొద్దు. రైతులకు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

29-05-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలోని రైతులు తమ పంటచేలలో ఉన్న వరికొయ్యలను తగలబెట్టవద్దని ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సూచించారు. ప్రస్తుతం మండుతున్న ఎండలు, వేగంగా వీస్తున్న గాలుల కారణంగా మంటలు త్వరగా వ్యాపించి భారీ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు.

వరికొయ్యలను తగలబెట్టడం వల్ల గడ్డివాములు, కరెంట్ వైర్లు, పైపులైన్లు దగ్ధమయ్యే ప్రమాదంతో పాటు మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. దీంతో రైతులతో పాటు ఇతరులకు కూడా తీవ్ర ఆర్థిక నష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు.

మంటలు ఆరిపోయినట్లు కనిపించినా గాలుల ప్రభావంతో మళ్లీ రగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండి తమతో పాటు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

వరికొయ్యలు తగలబెట్టొద్దు. రైతులకు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

Article Image

మండలంలోని రైతులు తమ పంటచేలలో ఉన్న వరికొయ్యలను తగలబెట్టవద్దని ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సూచించారు. ప్రస్తుతం మండుతున్న ఎండలు, వేగంగా వీస్తున్న గాలుల కారణంగా మంటలు త్వరగా వ్యాపించి భారీ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు.

వరికొయ్యలను తగలబెట్టడం వల్ల గడ్డివాములు, కరెంట్ వైర్లు, పైపులైన్లు దగ్ధమయ్యే ప్రమాదంతో పాటు మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. దీంతో రైతులతో పాటు ఇతరులకు కూడా తీవ్ర ఆర్థిక నష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు.

మంటలు ఆరిపోయినట్లు కనిపించినా గాలుల ప్రభావంతో మళ్లీ రగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండి తమతో పాటు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News