Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:05 AM

వార్డులలో ఇంటింటి ప్రచారం చేసిన బిఆర్ఎస్ నాయకులు

వార్డులలో ఇంటింటి ప్రచారం చేసిన బిఆర్ఎస్ నాయకులు

వార్డులలో ఇంటింటి ప్రచారం చేసిన బిఆర్ఎస్ నాయకులు
February 05, 2026 01:02 AM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 5, 6, 10, 12 వార్డులలో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా

5వ వార్డులో అభ్యర్థిగా శేఖర్,

6వ వార్డులో అభ్యర్థిగా సతీష్ కుమార్,

10వ వార్డులో అభ్యర్థిగా సనా సుల్తానా సయ్యద్ ఆసిఫ్,

12వ వార్డులో అభ్యర్థిగా పరశురాం

కారు గుర్తుతో ప్రజల ముందుకు వచ్చారని తెలిపారు.ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, నారాయణఖేడ్ పట్టణంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రతి గల్లీకి సిసి రోడ్లు వేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించి, నల్ల కలెక్షన్ల ద్వారా శుద్ధమైన నీటిని అందించామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు.పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని, అప్పుడు మాత్రమే నారాయణఖేడ్ మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలను కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News