Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:23 PM

వార్డు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్

20-02-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఎన్నికల హామీ అమలు… 10వ వార్డులో కౌన్సిలర్ మాట నిలబెట్టుకున్నారు!

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఇచ్చిన హామీని పదో వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో 10వార్డు ప్రజలను ఉద్దేశించి, “తనను గెలిపిస్తే వార్డు పరిధిలోని ప్రతి ఇంటి ఆడబిడ్డ వివాహానికి రూ.10,016లను కానుకగా అందిస్తాను” అని ఇచ్చిన మాటను ఆచరణలో చూపించారు.

అంబేద్కర్ నగర్‌కు చెందిన కీ.శే. సుంకరి నరసింహ–పద్మల ప్రథమ పుత్రిక రాజేశ్వరి వివాహ వేడుకలో కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్–కవిత దంపతులు పాల్గొన్నారు. యువశక్తి యువజన సంఘం సభ్యులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించి రూ.10,016లను నగదు రూపంలో కానుకగా అందజేశారు.

ప్రజలకు ఇచ్చిన మాట పవిత్రం. అది నిలబెట్టుకోవడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత” అని శ్రీనివాస్ పేర్కొన్నారు.వార్డు ప్రజలు కౌన్సిలర్ చర్యను అభినందిస్తూ, ఎన్నికల హామీలను అమలు చేయడం మంచి ప్రారంభమని అభిప్రాయపడ్డారు. యువశక్తి సభ్యులు కూడా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ప్రజలకు తోడుగా నిలుస్తామని తెలిపారు.

ప్రజా హామీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన చిట్యాలలో చర్చనీయాంశమైంది.

Sthanikam

వార్డు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News