Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:57 AM

వలిగొండలో బీసీ విద్యార్థుల సంఘం ధర్నా

వలిగొండలో బీసీ విద్యార్థుల సంఘం ధర్నా

వలిగొండలో బీసీ విద్యార్థుల సంఘం ధర్నా
17-12-2025 516 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కమిషన్లు రాగానే స్కాలర్షిప్లు నిలిపివేత?

రూ.8,500 కోట్ల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

వలిగొండలో బీసీ విద్యార్థుల సంఘం ధర్నా

వలిగొండ:స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వలిగొండ హైస్కూల్‌ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ ఆర్‌.కృష్ణన్న, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ర్యాగ అరుణ్‌ ఆదేశాల మేరకు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పల్లగొర్ల మోదీరాందేవ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు ఇవ్వకుండా పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంజనీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని, అప్లై చేసిన ప్రతి ఒక్కరికీ ఓవర్సీస్‌ స్కాలర్షిప్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి, మెస్‌ చార్జీలు పెంచాలి, విద్యార్థులకు ప్రకటించిన రూ.5 లక్షల భరోసా కార్డును వెంటనే అమలు చేయాలన్నారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, 100 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి హామీలను విస్మరించారని విమర్శించారు. ఫోర్త్‌ సిటీ, ఫ్లైఓవర్లు, అంతర్జాతీయ ఈవెంట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం విద్యార్థుల విషయంలో చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. ఫీజుల పెంపు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జినుకల కృష్ణ, డీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్ల నరేందర్‌, బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ ఎడ్ల మహాలింగం యాదవ్‌, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి చల్ల మనీల్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

వలిగొండలో బీసీ విద్యార్థుల సంఘం ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News