Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

వలిగొండ–కాటేపల్లి నూతన డబుల్ రోడ్డు ప్రారంభం

28-12-2025 197 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.49.50 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

స్థానికం ప్రతినిధి

వలిగొండ మండల కేంద్రంలో వలిగొండ నుంచి సుంకిశాల మీదుగా కాటేపల్లి వరకు నిర్మించనున్న నూతన డబుల్ రోడ్డు పనులను రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. రూ.49.50 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రాంత అభివృద్ధికి కీలక ముందడుగు పడిందని మంత్రి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేసిందని, ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నామని తెలిపారు.

భువనగిరి–చిట్యాల రహదారిని రూ.180 కోట్లతో త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

వలిగొండ–కాటేపల్లి రహదారి పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవసరమైన మౌలిక వసతులు బలోపేతం అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. నాణ్యమైన రహదారులు–సమగ్ర అభివృద్ధి అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, ప్రతి గ్రామ అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎన్‌ఆర్‌ఐ పైళ్ళ మల్లారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

వలిగొండ–కాటేపల్లి నూతన డబుల్ రోడ్డు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News