Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

విషాద వేళ మానవత్వం చాటిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్

30-12-2025 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం

వెల్లంకి గ్రామంలో మానవీయతకు నిలువెత్తు ఉదాహరణ

రామన్నపేట, స్థానికం ప్రతినిధి:

మండల పరిధిలోని వెల్లంకి గ్రామానికి చెందిన కందాల అండాలు అనారోగ్యంతో మృతి చెందడం గ్రామాన్ని విషాదంలో ముంచింది. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ స్పందించి మానవీయత చాటుకున్నారు.

సోమవారం అండాలు మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన సర్పంచ్, అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు అంత్యక్రియల నిమిత్తం రూ.5,000ల ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారు.

ఈ సందర్భంగా “ఆపదలో ఉన్న కుటుంబాలకు గ్రామ పంచాయతీ అండగా నిలుస్తుంది” అని సర్పంచ్ తెలిపారు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా ఒక మనిషిగా బాధను పంచుకోవడమే తన బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈడెం శ్రీనివాస్, వార్డు సభ్యులు జింక శాంతి, తలారి నరసింహ, జింక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ చర్యను గ్రామస్తులు ప్రశంసిస్తూ మానవత్వానికి మచ్చుతునకగా కొనియాడారు.

Sthanikam

విషాద వేళ మానవత్వం చాటిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News