Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హర్యానా నెంబర్ కారులో 67 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం

24-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఖమ్మం జిల్లా : వైరాలో ఎక్సైజ్ అధికారుల అప్రమత్తతతో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 101.2 కిలోల ఎండు గంజాయి, 2.7 కిలోల హాషీష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం అనుమానాస్పదంగా ఉన్న హర్యానా నెంబర్ ప్లేట్ కలిగిన కారును ఆపి తనిఖీ చేయగా ఈ మత్తు పదార్థాలు బయటపడ్డాయి. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసిన చెక్‌లో గంజాయి సంచులు, హాషీష్ ఆయిల్ ప్యాకెట్లు గుర్తించారు.

ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన మహమ్మద్ అస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని వైరా ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల మొత్తం విలువ సుమారు రూ. 67.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

డ్రగ్స్ రవాణాపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

Sthanikam

వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హర్యానా నెంబర్ కారులో 67 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం

Article Image

ఖమ్మం జిల్లా : వైరాలో ఎక్సైజ్ అధికారుల అప్రమత్తతతో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 101.2 కిలోల ఎండు గంజాయి, 2.7 కిలోల హాషీష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం అనుమానాస్పదంగా ఉన్న హర్యానా నెంబర్ ప్లేట్ కలిగిన కారును ఆపి తనిఖీ చేయగా ఈ మత్తు పదార్థాలు బయటపడ్డాయి. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసిన చెక్‌లో గంజాయి సంచులు, హాషీష్ ఆయిల్ ప్యాకెట్లు గుర్తించారు.

ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన మహమ్మద్ అస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని వైరా ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల మొత్తం విలువ సుమారు రూ. 67.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

డ్రగ్స్ రవాణాపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News