Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

విప్లవ రాజకీయాలే కామ్రేడ్ కట్టా నర్సింహారెడ్డి ని ప్రజా నాయకునిగా గుర్తింపు తెచ్చాయి

విప్లవ రాజకీయాలే కామ్రేడ్ కట్టా నర్సింహారెడ్డి ని ప్రజా నాయకునిగా గుర్తింపు తెచ్చాయి

విప్లవ రాజకీయాలే కామ్రేడ్ కట్టా నర్సింహారెడ్డి ని ప్రజా నాయకునిగా గుర్తింపు తెచ్చాయి
January 05, 2026 05:02 PM 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన విప్లవ కమ్యూనిస్టు కామ్రేడ్ కట్ట నర్సన్న

ఆర్.జనార్ధన్,జిల్లా కార్యదర్శి. సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

దోపిడీ వ్యవస్థకు ప్రత్యామ్నాయమైన నూతన ప్రజాస్వామిక విప్లవ రాజకీయాలే కామ్రేడ్ కట్టా నరసింహారెడ్డిని ప్రజా నాయకునిగా గుర్తింపులోకి తెచ్చాయని సీపీఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ అన్నారు. సోమవారం నాడు ఆలేరు మండలం టంగుటూరు లో కామ్రేడ్ కట్టా నర్సింహారెడ్డి (కట్ట నర్సన్న)37 వ వర్ధంతి కామ్రేడ్ కట్ట నర్సన్న స్మారక స్థూపం వద్ద జరిగింది. ఈ సందర్భంగా పార్టీ గ్రామ కమిటీ కార్యదర్శి మారుజోడు సిద్దేశ్వర్ జెండాను ఎగురవేశారు.కామ్రేడ్ కట్ట నర్సన్న విగ్రహానికి పార్టీ నాయకులతో పాటు, నర్సన్న జీవిత భాగస్వామి కట్టా అరుణ,కుమారుడు,గ్రామ మాజీ సర్పంచ్ కట్టా సమరసింహారెడ్డి తదితరులు పూలమాలలు వేసి రెండు నిముషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జరిగిన వర్ధంతి సభ లో జనార్ధన్ మాట్లాడుతూ విప్లవ రాజకీయాలే ప్రజలను సరియైన మార్గంలో నడిపించడంలో,సమాజం పట్ల బాధ్యత ను,ఉన్నతమైన వ్యక్తిత్వం,ఆలోచన కలిగించే విధంగా నిలబెడుతాయని,ఆ విధంగా నిలబడి ప్రజల కోసం కలబడిన వారిలో కామ్రేడ్ కట్ట నర్సన్న ఒకరని అన్నారు. పోరాట పంథాలో,పోరుబాటలో కామ్రేడ్ కట్ట నర్సన్న ప్రజా కంఠకులు,పెత్తందార్లు, పోలీస్ పత్వారీలు దోపిడీ వర్గాల నుండి అనేక ఆటుపోట్లను,దాడులను ఎదుర్కొన్నారని,కక్ష్య కట్టి పోలీస్ ల ద్వారా చెప్పలేనన్ని హింసలు,జైలు లో బంధించడం, భౌతికంగా నిర్మూలించడానికి అనేక ప్రయత్నాలు చేశాయని, విసిగిపోయి రాడికల్స్ ద్వారా హత్య చేయించారని అన్నారు.

బూర్జువా రాజకీయాలతో ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోగా,అన్ని వర్గాల ప్రజలను మరిన్ని బాధలకు గురిచేస్తాయని,తిరోగమనం లోకి నెట్టివేస్తాయని ఫలితంగా దోపిడీ ప్రభుత్వాలు రాజ్యమేలుతాయని,ప్రజల భవిష్యత్ మొత్తం ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు.

నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీ జే పీ మోడీ,అమిత్ షా ప్రభుత్వం నేల విడిచి సాము చేసినట్లుగా,ప్రజలను విడిచిపెట్టి,వారి క్షేమాన్ని మరిచి పిడికెడు మందిగా ఉన్న బడా కార్పోరేట్ సంస్థలకు,సామ్రాజ్యవాదులకు తొత్తులుగా మారి,కోట్లాది రూపాయల దేశ ఖనిజ సంపదను కొల్లగొట్టుకపోవడానికి గేట్లు బార్లా తెరిచాయని ఆరోపించారు. వెనుజువెలా పై అమెరికా సామ్రాజ్యవాదం అక్రమంగా దాడులు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో,ఆయన భార్య చెరిలిన్ పోర్లెస్ లను తన సైనిక చర్య ద్వారా పట్టుకొని న్యూయార్క్ కు తరలించి బంధించడం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధమని జనార్ధన్ స్పష్టం చేశారు. ఒక దేశ సార్మాబౌమాదికారాన్ని విచ్ఛిన్నం చేస్తూ,ఆ దేశంలో జోక్యం చేసుకోవడం,ఆ దేశ న్యాయ,చట్టాలకు విరుద్ధంగా ఆ దేశంలోకి చొరబడం దేశాధ్యక్షున్ని బంధించడాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తుంటే భారత్ మాత్రం మౌనంగా ఉండడం అంటే ఇలాంటి దురాక్రమ దాడులకు మద్దతుతెలపడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్,ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య,పీ ఓ డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత,జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్,ఏఐకెఎంఎస్ జిల్లా నాయకులు మామిడాల బాల మల్లేష్,చిర బోయిన కొమురయ్య,కొత్త పేట వీరమల్లు,మారుజోడు కుమార్,కళ్లెపు మధు,ఇక్కిరి సిద్ధులు,వడ్డేపల్లి బాలరాజు,నల్ల నరసింగారావు,కళ్లెపునర్సింహులు, ఎలగందుల సిద్దులు,కళ్లెపు చంద్రయ్య,వడ్డేపల్లి సాయి,కళ్లెపు ప్రణయ్ కుమార్,తమ్ముడి అంజయ్య కర్రే స్వామి,సుంచు రాములు,కుర్రిమార్కండేయ,తమ్ముడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News