Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:22 AM

వైఎస్సార్‌ తర్వాత వడ్డెరలకు అండగా నిలిచింది రేవంత్‌రెడ్డే

12-05-2026 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుంజ రేణుక నారాయణ నియామకం చారిత్రాత్మకం: ఆలకుంట్ల రాజు

రామన్నపేట

వడ్డెరలకు వైఎస్సార్‌ తర్వాత న్యాయం చేసింది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు ఆలకుంట్ల రాజు పేర్కొన్నారు. రాష్ట్ర వడ్డెర కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గుంజ రేణుక నారాయణను నియమించడం హర్షణీయమన్నారు.

మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వడ్డెరలకు కనీస న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు గుంజ రేణుక నారాయణ నియామకాన్ని వ్యతిరేకించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

వడ్డెరల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని, రాజశేఖర్‌రెడ్డి తర్వాత వడ్డెరలకు కార్పొరేషన్‌ పదవి కల్పించింది కాంగ్రెస్‌ పార్టీయేనని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం, అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ మంజల్కర్‌కు ఆలకుంట్ల రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

వైఎస్సార్‌ తర్వాత వడ్డెరలకు అండగా నిలిచింది రేవంత్‌రెడ్డే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News