Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

విద్యలో నారాయణఖేడ్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు

23-12-2025 171 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యలో నారాయణఖేడ్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు

స్థానిక ప్రతినిధి

ప్రభుత్వ పాఠశాల ప్రగతికి ప్రతీకగా నిలిచిన మన్మధ కిషోర్‌కు ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు

ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలను చెరిపేస్తూ, విద్యలో నాణ్యత అంటే ఏమిటో నిరూపిస్తూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాయణఖేడ్ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. విద్యా ప్రగతి, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, వినూత్న బోధనా విధానాలతో పాఠశాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నందుకు ఉమ్మడి మెదక్ జిల్లా ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మన్మధ కిషోర్‌కు ప్రతిష్ఠాత్మక ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు వరించింది.

హైదరాబాద్‌లోని నోవాటల్ కన్వెన్షన్‌లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో సీబీఐ మాజీ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడం ఉపాధ్యాయులపై ఉన్న అత్యంత కీలకమైన సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను సమాజం గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయుల స్ఫూర్తితోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని స్పష్టం చేశారు.

కార్యక్రమ నిర్వాహకులు సంధ్యా రాజగోపాల్ మాట్లాడుతూ—మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో నూతన సాంకేతికతను సమన్వయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పాఠశాల విద్యార్థులకు ఆధునిక బోధన అందించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.

నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రత్యేకంగా ఎంపిక చేయడానికి 900 మందికి పైగా విద్యార్థులతో కూడిన బలమైన విద్యా వాతావరణం, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాల అభివృద్ధికి చేపడుతున్న నిరంతర కార్యక్రమాలు, విద్యా–సహ విద్యా కార్యకలాపాల్లో పాఠశాల సాధిస్తున్న విజయాలే ప్రధాన కారణాలని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్రశేఖర ఆచార్యతో పాటు పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు.

Sthanikam

విద్యలో నారాయణఖేడ్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News