Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:23 AM

విద్యకు దిశ చూపిన సావిత్రిబాయి ఫూలేకు నాగార్జున స్కూల్ ఘన నివాళి

05-01-2026 179 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున స్కూల్లో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

రామన్నపేట స్థానికం ప్రతినిధి

నాగార్జున స్కూల్లో సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, విద్యార్థులు ఉన్నతాధికారులు, ఉపాధ్యాయుల పాత్రలు పోషిస్తూ వివిధ సబ్జెక్టులు బోధించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ప్రిన్సిపాల్ రేఖ.ఎన్ సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసినివాళులర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, సామాజిక సంస్కర్తగా సావిత్రిబాయి ఫూలే మహిళా విద్యకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి బాలికల కోసం తొలి పాఠశాల స్థాపించి మహిళల విద్యకు దారితీసిన గొప్ప వ్యక్తిత్వమని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నది ఆమె ఆశయమని తెలిపారు. సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ నాగరాజు.ఎన్ విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు అక్రమ్, సంధ్య, స్వప్న, విజయశ్రీలత, వినిషతో పాటు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

విద్యకు దిశ చూపిన సావిత్రిబాయి ఫూలేకు నాగార్జున స్కూల్ ఘన నివాళి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News