Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 02:55 AM

విద్యుత్ ఆర్టిజన్ల ‘మహాధర్నా’ విజయవంతం

విద్యుత్ ఆర్టిజన్ల ‘మహాధర్నా’ విజయవంతం

విద్యుత్ ఆర్టిజన్ల ‘మహాధర్నా’ విజయవంతం
26-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఏప్రిల్ 8 నుంచి సమ్మెకు సిద్ధం డివిజన్ ఆఫీసుల వద్ద నిరసన..

నల్లగొండ:

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC) పిలుపు మేరకు ఆర్టిజన్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై పోరుబాట పట్టారు. ఏప్రిల్ 8 నుంచి చేపట్టనున్న సమ్మెకు సన్నద్ధమౌతూ గురువారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా డివిజన్ కార్యాలయాల ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి వివిధ కార్మిక సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించాయి.

విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్‌ఈబీ (APSEB) సర్వీస్ రూల్స్‌ను వర్తింపజేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

విద్యా అర్హతలను బట్టి కార్మికులకు కన్వర్షన్ ఇవ్వాలని, ఆర్టిజన్లుగా గుర్తించకుండా మిగిలిపోయిన కార్మికులను తక్షణమే గుర్తించాలని కోరారు. టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) తరహాలోనే టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) లోని లైన్ మ్యాన్ హెల్పర్లకు ఆర్టిజన్ హోదా కల్పించాలని పట్టుబట్టారు. వీటితో పాటు పీస్ రేట్, మీటర్ రీడింగ్ కార్మికులు, కలెక్షన్ ఏజెంట్లు, సెక్యూరిటీ గార్డులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించి, నెలకు 30 రోజుల పని కల్పించాలని నిరసన గళం విప్పారు.ఈ ధర్నాకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, 327 యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సుమ్మిరెడ్డి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్, 1104 యూనియన్ నేతలు శ్రీనివాస్, శిరు రాంబాబు, టీఆర్‌వీకేఎస్ డివిజన్ కార్యదర్శి మైనం ఉపేందయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు.​నల్లగొండ జిల్లా ఉమ్మడి జేఏసీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ జెట్టుబోయిన లింగస్వామి యాదవ్, కన్వీనర్ మద్ది శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్లు వేణుగోపాల్ రెడ్డి, చుప్పలపల్లి రమేష్, బామ్మి సహదేవ్, మెకల బిక్షమయ్య, పేరి షేర్, విజయ్, ఉమాదేవి, రజియా, శైలజ, లింగారెడ్డి, భూషణం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యుత్ ఆర్టిజన్ల ‘మహాధర్నా’ విజయవంతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News