Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:41 AM

వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యే ఇంట శబరిమల వాతావరణం

21-12-2025 103 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మెల్యే నివాసంలో శబరిమల వైభవం

ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ

స్థానిక ప్రతినిధి నకిరేకల్

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన స్వగృహంలో స్వామి అయ్యప్ప మహాపడి పూజోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వామి శ్రీమన్ శ్రీ సి. వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో వేదమంత్రాల మధ్య ఐదు గంటలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పంచామృతాభిషేకం, జలాభిషేకం, పుష్పాభిషేకాలతో స్వామిని అలంకరించి హారతి ఇచ్చారు. ఎమ్మెల్యే వీరేశం కుమారుడితో కలిసి స్వయంగా పూజల్లో పాల్గొన్నారు. ‘స్వామి శరణం–అయ్యప్ప శరణం’ శరణుఘోషలతో పన్నాలగూడెం పరిసరాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి.

అయ్యప్ప దీక్ష కులమతాలకు అతీతమై అందరినీ ఒక్కటిగా నిలుపుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామిని ప్రార్థించారు. వచ్చే ఏడాది నుంచి నకిరేకల్ పట్టణంలో అయ్యప్ప స్వాములకు బిక్ష, అల్పాహార ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

Sthanikam

వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యే ఇంట శబరిమల వాతావరణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News