Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:23 AM

వడ్ల కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ ఉమా హారతి

13-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలం నరసాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని డిఎన్టి తండాలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న వడ్ల కొనుగోలు ప్రక్రియ, తూకం విధానం, నిల్వలు తదితర అంశాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వడ్ల విక్రయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకోగా, లారీల కొరత కారణంగా కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరుగుతోందని రైతులు, ఐకెపి సిబ్బంది తెలిపారు. లారీలను సక్రమంగా అందుబాటులో ఉంచితే రైతులు తీసుకొచ్చిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించే అవకాశం ఉంటుందని వారు వివరించారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి, లారీల కొరత సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రస్తుతం కేంద్రంలో వడ్ల కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయని రైతులు ఖేఢ్ సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

Sthanikam

వడ్ల కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ ఉమా హారతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News