Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:28 AM

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ కుట్రలు. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

17-05-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తే సహించేది లేదని జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి తిమ్మాపురం మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

ఆదివారం మండల విలేకరులతో మాట్లాడుతూ రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎప్పటికప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

రైతులకు సహకరించాల్సింది పోయి రాస్తారోకోలు, ధర్నాల పేరుతో అలజడి సృష్టించడం సరికాదన్నారు. రైతులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Sthanikam

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ కుట్రలు. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News