Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:25 PM

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యే వట్టే జానయ్య యాదవ్‌నే

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యే వట్టే జానయ్య యాదవ్‌నే

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యే వట్టే జానయ్య యాదవ్‌నే
February 09, 2026 10:14 AM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భానుపురి

ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందించే సామాగ్రిపై రూ.100 కోట్ల మేర భారీ స్కామ్ జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆరోపించారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అధ్యక్షతన ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ గురుకులాలు, అనుబంధ పాఠశాలల్లో విద్యార్థులకు సరఫరా చేసే సామాగ్రిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో విడుదలైన రూ.44 కోట్లలో రూ.40 కోట్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కలిసి మాయం చేశారని ఆరోపించారు. అదే విధానాన్ని కొనసాగిస్తూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.100 కోట్ల స్కామ్‌కు పాల్పడిందన్నారు.

అగ్రకుల, పెత్తందారి వ్యవస్థను నడిపే పార్టీల వల్లే ప్రభుత్వ ఆదాయం అవినీతికి, అక్రమాలకు దారి తీస్తోందని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు బువ్వ తిని బతికితే అగ్రకుల నాయకులు మాత్రం బలహీనుల భూములు తింటూ బతుకుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జవాన్ రామస్వామి పేరుతో ఉన్న భూమిని స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఓ జవాన్ తల్లిని అడ్డం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు, బలహీన వర్గాల కుటుంబాలు బాగుపడతాయని ఆశించామని, కానీ నేడు అగ్రకుల నాయకత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలుగా మార్చిందని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వట్టే జానయ్య యాదవ్‌పై బీఆర్ఎస్ నాయకులు లేనిపోని భూకబ్జా ఆరోపణలు మోపి రాజకీయంగా దెబ్బతీయాలని చూశారని, కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. అన్ని ఆరోపణల నుంచి వట్టే జానయ్య యాదవ్ కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని అన్నారు.

వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. అదే ఎన్నికల్లో తెలంగాణ బీసీ బిడ్డనే ముఖ్యమంత్రిగా చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అగ్రకులానికి చెందిన వ్యక్తిని ప్రకటించే అధికారం కాంగ్రెస్ నాయకులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అగ్రకుల పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఆదరించవద్దని పిలుపునిస్తూ, బడుగు వర్గాలకు అండగా నిలుస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News