Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న మానూర్ తహశీల్దార్ విష్ణు సాగర్

27-01-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న విష్ణు సాగర్ తన ఉత్తమ సేవలతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో చూపిన అంకితభావాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఉత్తమ తహశీల్దార్ అవార్డుతో సత్కరించింది.సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసీ రాష్ట్ర చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా మానూర్ మండల తహశీల్దార్ విష్ణు సాగర్‌కు ఉత్తమ సేవల ప్రశంసా పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, విష్ణు సాగర్ ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం, భూ పరిపాలన, సంక్షేమ పథకాల అమలులో చూపిన నిబద్ధత, కష్టపడే స్వభావం ఇతర అధికారులకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. ఈ అవార్డు మానూర్ మండలానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ గౌరవం అందుకోవడం పట్ల విష్ణు సాగర్ సంతోషం వ్యక్తం చేస్తూ, తన విజయానికి సహకరించిన ఉన్నతాధికారులు, సహచరులు మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న మానూర్ తహశీల్దార్ విష్ణు సాగర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News