Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:23 AM

ఉత్తమ విద్యార్థులు, అధ్యాపకులకు ఘన సన్మానం

13-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు మూడో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడా–సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ కార్యక్రమాల్లో విశేష ప్రతిభ చాటిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న అధ్యాపకులను కూడా ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రతిభను చాటినప్పుడే విద్యార్థులకు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

డాక్టర్‌ తండు కృష్ణ కౌండిన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ చెనగోని వెంకట్‌గౌడ్‌, అద్దంకి ఆంజనేయులు, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మీ నీలిమ పాల్గొన్నారు.

అలాగే అధ్యాపకులు డాక్టర్‌ జి. సునీత, డాక్టర్‌ డి. కిషన్‌, డాక్టర్‌ పి. బ్రహ్మం, డాక్టర్‌ ఎం. రవీందర్‌రావు, టి. శ్రీనివాస్‌, రవితో పాటు కార్యాలయ సిబ్బంది ఫయాజ్‌, షరీఫ్‌, శ్రీదేవి, బసవయ్య, రాంబాబు, కిరణ్‌, నవీన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఉత్తమ విద్యార్థులు, అధ్యాపకులకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News