Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:51 PM

ఉత్కంఠ భరిత కౌంటింగ్‌లో గులాబీ దూకుడు

ఉత్కంఠ భరిత కౌంటింగ్‌లో గులాబీ దూకుడు

ఉత్కంఠ భరిత కౌంటింగ్‌లో గులాబీ దూకుడు
February 14, 2026 01:05 PM 279 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తిరుమలగిరి మున్సిపాలిటీలో 15లో 10 వార్డులు భారత రాష్ట్ర సమితి ఖాతాలో – 5 స్థానాలతో కాంగ్రెస్ ప్రతిపక్షం

తిరుమలగిరి: ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తం 15 వార్డులకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 10 వార్డులను కైవసం చేసుకున్న భారత రాష్ట్ర సమితి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే స్థితికి చేరుకుంది. ఐదు వార్డులు గెలుచుకున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధిక్య సంఖ్యను అందుకోలేక ప్రతిపక్షంగా నిలిచింది.ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచే భారత రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. చైర్మన్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించి వార్డు స్థాయిలో సమన్వయం చేస్తూ ప్రచారాన్ని నడిపింది. గ్రామీణ శైలిలో ఇంటింటికీ చేరి ఓటర్లను ఆకట్టుకోవడంలో పార్టీ శ్రేణులు సమర్థంగా కృషి చేశాయి. “చైర్మన్ పీఠం మాదే” అన్న నినాదంతో ప్రారంభమైన ప్రచారం ఫలితాల్లో ప్రతిఫలించింది. పది స్థానాలు గెలుచుకోవడంతో మున్సిపాలిటీపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది.ఇక కాంగ్రెస్ పార్టీ విషయంలో వ్యూహాత్మక లోపాలు ప్రతికూలంగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం, బీఫారం జారీ విషయంలో తడబాటు, ముఖ్యంగా చైర్మన్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించకపోవడం పార్టీకి నష్టమైందని చెబుతున్నారు. అంతర్గత సమన్వయ లోపం కూడా ఫలితాలపై ప్రభావం చూపిందని విశ్లేషిస్తున్నారు. తిరుమలగిరి రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి విజయంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా, కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన అవసరమని స్థానిక వర్గాలు భావిస్తున్నాయి.

వార్డుల వారీగా విజేతలు

1వ వార్డు – పనికెరా లక్ష్మి (భారత రాష్ట్ర సమితి) 76 ఓట్ల మెజార్టీతో విజయం

2వ వార్డు – జక్కుల రమేష్ (భారత రాష్ట్ర సమితి) 74 ఓట్ల మెజార్టీతో విజయం

3వ వార్డు – కారుపోతుల సోమలక్ష్మి నరేష్ (భారత రాష్ట్ర సమితి) 88 ఓట్ల మెజార్టీతో విజయం

4వ వార్డు – బత్తుల శకుంతల (భారత రాష్ట్ర సమితి) 98 ఓట్ల మెజార్టీతో విజయం

5వ వార్డు – తిరుమణి యాదగిరి (భారత జాతీయ కాంగ్రెస్) 83 ఓట్ల మెజార్టీతో విజయం

6వ వార్డు – కేసిడి కవిత వెంకటరెడ్డి (భారత జాతీయ కాంగ్రెస్) 89 ఓట్ల మెజార్టీతో విజయం

7వ వార్డు – బత్తుల శ్రీను (భారత జాతీయ కాంగ్రెస్) 78 ఓట్ల మెజార్టీతో విజయం

8వ వార్డు – చిలుక వెన్నెల అంజి (భారత జాతీయ కాంగ్రెస్) 73 ఓట్ల మెజార్టీతో విజయం

9వ వార్డు – కన్నెబోయిన మల్లయ్య (భారత జాతీయ కాంగ్రెస్) 123 ఓట్ల మెజార్టీతో విజయం

10వ వార్డు – భూక్య యాకూబ్ నాయక్ (భారత రాష్ట్ర సమితి) 2 ఓట్ల మెజార్టీతో విజయం

11వ వార్డు – ఏమోజు గోవిందమ్మ రవీందర్ (భారత రాష్ట్ర సమితి) 321 ఓట్ల మెజార్టీతో విజయం

12వ వార్డు – కందుకూరి గీత బాబు (భారత రాష్ట్ర సమితి) 150 ఓట్ల మెజార్టీతో విజయం

13వ వార్డు – సంకేపల్లి జ్యోతి నరోత్తం రెడ్డి (భారత రాష్ట్ర సమితి) 67 ఓట్ల మెజార్టీతో విజయం

14వ వార్డు – సంకేపల్లి రఘునందన్ రెడ్డి (భారత రాష్ట్ర సమితి) 128 ఓట్ల మెజార్టీతో విజయం

15వ వార్డు – పత్తేపురం త్రిశూల్ (భారత రాష్ట్ర సమితి) 195 ఓట్ల మెజార్టీతో విజయం

మొత్తం ఫలితాల్లో పది స్థానాలు సాధించి భారత రాష్ట్ర సమితి తిరుమలగిరి మున్సిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యాన్ని చాటుకోగా, ఐదు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా నిలిచింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News