Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

ఊరూరా ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

29-03-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- గుల్లపల్లి వెంకటేష్ గౌడ్

- ఏప్రిల్ 2న విప్లవ వీరుడికి నివాళులు మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుల పిలపు

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని ఏప్రిల్ 2వ తేదీన జిల్లావ్యాప్తంగా ఊరూరా,వాడవాడలా ఘనంగా నిర్వహించాలని గౌడ జనహక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) జిల్లా అధ్యక్షులు గుల్లపల్లి వెంకటేష్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పాపన్న గౌడ్ వీరోచిత చరిత్రను,ఆయన చేసిన పోరాటాలను నేటి తరానికి చాటిచెప్పాలని కోరారు.ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ..మొఘల్ సామ్రాజ్య క్రూర పాలనకు,జమీందార్ల దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన మహానుభావుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు.1650లో ఖిలాషాపూర్ గ్రామంలో సామాన్య గౌడ కుటుంబంలో జన్మించిన ఆయన,అణగారిన వర్గాలను ఏకం చేసి మొఘల్ సైన్యాన్ని గడగడలాడించారని గుర్తు చేశారు.దళితులు,వెనుకబడిన వర్గాలతో సైన్యాన్ని ఏర్పాటు చేసి,గెరిల్లా యుద్ధం ద్వారా మొఘలులకు ప్రధాన శత్రువుగా మారారు.ఖిలాషాపూర్,తాడికొండ,భువనగిరి వంటి చోట్ల కోటలు నిర్మించి సార్వభౌమాధికారాన్ని చాటారు.1708లో వరంగల్ కోటను ఆక్రమించి విజయ పతాకం ఎగురవేశారు. ఆలయాల ధ్వంసాన్ని అడ్డుకుంటూ,మహిళల గౌరవాన్ని కాపాడుతూ'అపర శివాజీగా,హిందూ ధర్మ పరిరక్షకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం పాపన్న గౌడ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో,ఏప్రిల్ 2న ప్రతి గ్రామంలో గౌడ కుల బాంధవులు,బహుజనులు ఐక్యంగా పాల్గొని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని వెంకటేష్ గౌడ్ కోరారు.ఆత్మగౌరవం,సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన బాటలో నడవడమే పాపన్న గౌడ్ కు మనం ఇచ్చే నిజమైన గౌరవమని ఆయన అన్నారు.

Sthanikam

ఊరూరా ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News