Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి..

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి..

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి..
15-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి దూడ రాజనార్సుబాబు ఈరోజు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల శాఖ మంత్రి శ్రీ లక్ష్మణ్ కుమార్ ను కలిశారు. వారు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పిఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.అంతేకాక, ఉపాధ్యాయులు ప్రభుత్వపరంగా రావాల్సిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, హెల్త్ కార్డులను, హెల్త్ ట్రస్టు ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ కార్యక్రమాలను అధికారికంగా మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించాలని, రిటైర్మెంట్ అయిన రోజునే వారికి పెన్షన్ పత్రాలను మంజూరు చేయాలని వారు కోరారు.అదేవిధంగా, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రమోషన్ కోసం అడ్డంకి గా ఉన్న "అడాక్వసి" అనే పదాన్ని తొలగించి, ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకూ ప్రమోషన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే 342 జీవో ప్రకారం ప్రస్తుతంలో బీఈడీకి ఇస్తున్న అనుమతిని ఇతర పీజీ కోర్సులు చదివేందుకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లను మంత్రికి అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లు మరియు డైరీలను గౌరవ మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడ రాజనర్సు బాబు, రాము నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News