Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:00 AM

ఉపాధి పనికి వెళ్లి వృద్ధురాలి మృతి

ఉపాధి పనికి వెళ్లి వృద్ధురాలి మృతి

ఉపాధి పనికి వెళ్లి వృద్ధురాలి మృతి
24-05-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తీవ్ర ఎండలతో అస్వస్థత.. మొగ్గయ్యగూడెంలో విషాదం

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ వృద్ధురాలు తీవ్ర ఎండల కారణంగా అస్వస్థతకు గురై మృతి చెందింది. గ్రామానికి చెందిన షేక్ జానమ్మ (65) శనివారం ఉదయం గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు వెళ్లింది.

ఉదయం నుంచే మండుతున్న ఎండల మధ్య పని చేసిన జానమ్మ మధ్యాహ్న సమయంలో ఇంటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఆమెకు తీవ్ర అస్వస్థత కలగడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం తీసుకెళ్లేలోపే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

జానమ్మ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధి పనులకు వెళ్లే కార్మికులకు తీవ్ర ఎండల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో పనివేళలను ఉదయం సమయానికే పరిమితం చేసి, తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

ఉపాధి పనికి వెళ్లి వృద్ధురాలి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News