Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:19 PM

ఉపాధి కూలీలకు 200 రోజుల పని.. రూ. 800 వేతనం ఇవ్వాలి

09-04-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​కేంద్ర ప్రభుత్వ విధానాలపై నర్సింహ్మ ధ్వజం

​జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని, రోజువారీ కూలీని రూ. 800కు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చౌటుప్పల్ మండల పరిధిలోని కుంట్లగూడెంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన సందర్శించి, కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.​ఈ సందర్భంగా నర్సింహ్మ మాట్లాడుతూ, భానుడి భగభగలకు ఉపాధి కూలీలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2005 చట్టం ప్రకారం పని ప్రదేశంలో నీడ కోసం టెంట్లు, తాగునీరు, మెడికల్ కిట్లు, పనిముట్లు అందించాల్సి ఉన్నప్పటికీ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వాటన్నింటినీ ఎత్తివేసిందని విమర్శించారు. మౌలిక వసతులు లేక ప్రతి ఏటా వేసవిలో వందలాది మంది కార్మికులు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు.​హక్కులను కాలరాస్తున్న కొత్త చట్టాలు​"గాంధీ పేరుతో ఉన్న పాత చట్టాన్ని మార్చి, కొత్త నిబంధనలతో కూలీల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. రెండు పూటలా ఫోటోలు తీయాలనే నిబంధనతో కార్మికులను వేధిస్తున్నారు. 125 రోజుల పని అని గొప్పలు చెబుతూనే, మరోవైపు వ్యవసాయం పేరుతో 60 రోజులు పని బంద్ చేయడం ఎంతవరకు సమంజసం?" అని ఆయన ప్రశ్నించారు.​ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఉపాధి హామీ చట్టమే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు మానే సాలయ్య, మండల ఉపాధ్యక్షులు యాట బాలరాజు, డివైఎఫ్ఐ నాయకులు జంగిలి సాయి, మల్లెబోయిన కృష్ణ, గంగాదేవి సత్తమ్మ, విజయ, భాగ్యమ్మ, పూలమ్మ, రూపమ్మ, లలిత, వసంత, రాధ, జయమ్మ, అండమ్మ, అన్యాలపు అరుణ, మంగమ్మ, వసంత , సుత్తమ్మ , కొండ కౌంసల్య, మల్లమ్మ, రాధ, శోభ, మంజుల, లక్ష్మమ్మ, బందెల లక్ష్మి, శోభ, దోనూరు సునీత, పినింటి కమలమ్మ, చంద్రకళ, గువ్వల వరలక్ష్మి, శశికళ, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి కూలీలకు 200 రోజుల పని.. రూ. 800 వేతనం ఇవ్వాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News