Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:23 PM

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య

28-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి  : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉన్న పేరును మార్చడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆరోపించారు.కాంగ్రెస్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వ ఆదేశాల మేరకు గురువారం తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలుగుపల్లి గ్రామ పంచాయతీతో పాటు సింగారం తండా గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల ప్రదేశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి, పథకం పేరును మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎలా బలహీనపరచాలని చూస్తుందో వారికి వివరించారు. గ్రామీణ పేదలు, కూలీలకు ఈ పథకం జీవనాధారమని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వాసం వెంకన్న, వెలుగుపల్లి గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ కన్నారెడ్డి, మాజీ మండల పరిషత్ సభ్యుడు సోమ్లా నాయక్, సింగారం తండా గ్రామ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త రామడుగు నవీన్ చారి, నాయకులు దయ్యాల వెంకటనారాయణతో పాటు గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య

Article Image

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి  : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉన్న పేరును మార్చడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆరోపించారు.కాంగ్రెస్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వ ఆదేశాల మేరకు గురువారం తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలుగుపల్లి గ్రామ పంచాయతీతో పాటు సింగారం తండా గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల ప్రదేశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి, పథకం పేరును మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎలా బలహీనపరచాలని చూస్తుందో వారికి వివరించారు. గ్రామీణ పేదలు, కూలీలకు ఈ పథకం జీవనాధారమని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వాసం వెంకన్న, వెలుగుపల్లి గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ కన్నారెడ్డి, మాజీ మండల పరిషత్ సభ్యుడు సోమ్లా నాయక్, సింగారం తండా గ్రామ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త రామడుగు నవీన్ చారి, నాయకులు దయ్యాల వెంకటనారాయణతో పాటు గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News