Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:50 AM

ఉపాధి హామీ హక్కుపై కేంద్ర ప్రభుత్వం దాడి

04-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు ఏఐపీకేఎంఎస్ మద్దతు

ఖమ్మం:

గ్రామీణ పేదల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు విమర్శించారు. బుధవారం వైరా డివిజన్ అధ్యక్షుడు ఎస్.కే.జానీ అధ్యక్షతన విక్రమ్ భవనంలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను ఉద్యమాల భయంతో వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు దొడ్డిదారిన నాలుగు కార్మిక కోడులను ప్రవేశపెట్టి కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. వికసిత్ భారత్ పేరిట కొత్త పథకాలను తెచ్చి కోట్లాది గ్రామీణ కూలీల పని హక్కును లాక్కునే కుట్ర జరుగుతోందన్నారు. ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదల హక్కు అని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది దళితులు, గిరిజనులు, భూమిలేని కూలీలు ఈ చట్టంపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు కార్మిక కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఏఐపీకేఎంఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు, కంకణాల పెద వెంకటి, తడికమాల వెంకన్న, సాగి అప్పారావు, ఆవుల భద్రయ్య, సుబ్బారావు, చిన్న వెంకటి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ హక్కుపై కేంద్ర ప్రభుత్వం దాడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News