Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

ఉపాధి హామీ రక్షణ కోసం 15న గ్రామీణ సమ్మె

ఉపాధి హామీ రక్షణ కోసం 15న గ్రామీణ సమ్మె

ఉపాధి హామీ రక్షణ కోసం 15న గ్రామీణ సమ్మె
09-05-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి : కొండమడుగు నర్సింహ

ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, విబి-జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 15న దేశవ్యాప్తంగా నిర్వహించే గ్రామీణ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

శనివారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఆయన కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ కోసం టెంట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, వైద్య సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూలీల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని, పే స్లిప్‌లు ఇవ్వడం లేదని విమర్శించారు.రోజుకు రూ.800 కూలి, సంవత్సరానికి 200 రోజుల పని, ప్రతి కార్మికుడికి అవసరమైన పనిముట్లు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గంగాదేవి సైదులు మాట్లాడుతూ ఈనెల 13న నిర్వహించే మండల మహాసభలో కార్మికులు, పేదలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు మానే సాలయ్య, సహాయ కార్యదర్శి రాపోతు పద్మ, మండల నాయకురాలు చెరుకు లక్ష్మమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ చినగొని అనిత, కార్మికులు జంగమ్మ, సత్తమ్మ, పద్మ, కమలమ్మ, బుచ్చమ్మ, జయలక్ష్మి, కలమ్మ, అశోక్, సంతోష, జయమ్మ, పూలమ్మ, మహాంకాళి, లావణ్య, జ్ఞానేశ్వరి, అంజమ్మ, జయమ్మ, అనిత, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ రక్షణ కోసం 15న గ్రామీణ సమ్మె

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News