Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:31 AM

ఉపాధ్యాయులకు ఘన సన్మానం సర్పంచ్ విక్రమ్

ఉపాధ్యాయులకు ఘన సన్మానం సర్పంచ్ విక్రమ్

 ఉపాధ్యాయులకు ఘన సన్మానం సర్పంచ్ విక్రమ్
04-01-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

ఇంద్రపాలనగరం

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మార్గదర్శక సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని ఇంద్రపాలనగరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, అణగారిన వర్గాల విద్యకు జీవితాంతం పోరాడిన ఆమె సేవలను స్మరించుకుంటూ గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ—భారతదేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి సమానత్వం, న్యాయం కోసం సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం విద్యను విప్లవాత్మకంగా మార్చిన ఆమె అపార కృషికి గౌరవ సూచకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లస్వామి జయసుధ, వార్డ్ మెంబర్లు, యువనాయకుడు సింగణబోయిన గణేష్, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్ కొమ్మగోని మమత, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Sthanikam

ఉపాధ్యాయులకు ఘన సన్మానం సర్పంచ్ విక్రమ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News