Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:45 AM

ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన”

ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన”

ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన”
December 21, 2025 07:40 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన”

నల్గొండ, స్థానిక ప్రతినిధి:

జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి కొత్త పేరుతో అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో క్లాక్ టవర్ నుంచి రామగిరిలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కైలాష్ నేత మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంతో మహాత్మా గాంధీ పేరు అనుబంధమై ఉందని, ఆ పేరును తొలగించి రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త పేరు పెట్టడం నీచ రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి చర్యలు వెంటనే మానుకోకపోతే జిల్లా వ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్, ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నూనె కోటి, జిల్లా నాయకులు పెరుమాండ్ల నరేష్, మంగదుడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు కేతపల్లి మండల అధ్యక్షులు కంపసాటి శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏఐసీసీ కేకేసీ అధ్యక్షులు కత్తుల వీరన్న, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాని యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ పల్నాటి సుధాకర్ రెడ్డి, ఇనుపాముల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మాచర్ల శ్రీనివాసులు సహా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News