Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:40 AM

ఉపాధి హామీ చట్టంపై బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా సిపిఎం ఆందోళన

20-12-2025 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు వ్యతిరేకంగా సిపిఎం ఆందోళన

గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని చంపే ప్రయత్నం: జల్లెల పెంటయ్య

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కేవలం ఒక పథకంగా మార్చాలనే బీజేపీ కేంద్ర ప్రభుత్వ కుట్రను గ్రామీణ పేదలు ఐక్యంగా తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు.

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని “జీ–రామ్–జీ”గా పేరు మార్చి, రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ సెంటర్ వద్ద బిల్లు ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా జల్లెల పెంటయ్య మాట్లాడుతూ… గత రెండు దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భరోసానిచ్చిన కీలకమైన చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం పద్ధతిగా నిర్వీర్యం చేయాలని చూస్తోందని విమర్శించారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే వారసులే నేడు గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ బిల్లును పార్లమెంటులో సమగ్ర చర్చ లేకుండానే, ప్రజాస్వామ్య సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ ఆమోదించారని ఆరోపించారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడమే కాకుండా, సెలెక్ట్ కమిటీకి పంపాలన్న డిమాండ్‌ను కూడా తిరస్కరించారని తెలిపారు. ఇది పూర్తిగా నియంతృత్వ ధోరణిలో చట్ట నిర్మాణం చేసినట్టేనని అన్నారు.

పేదల కంచంలో మట్టి పోసి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే బీజేపీ విధానాలను గ్రామీణ ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి నాగేష్, మండల కమిటీ సభ్యులు గొరిగి సోములు, భావండ్లపల్లి బాలరాజు, నాగటి ఉపేందర్, తొలుపునూరి శ్రీనివాస్, గంటపాక శివకుమార్, శాఖా కార్యదర్శులు మునికుంట్ల లెనిన్, గుండాల ప్రసాద్, ఉప సర్పంచ్ ముక్కముల మల్లేష్, మేడి ముకుందం, అప్పం సురేందర్, బావండ్లపల్లి సత్యం, గంటెపాక శ్రీకృష్ణ, తుర్కపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ చట్టంపై బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా సిపిఎం ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News