Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:55 AM

ఉల్లి రైతుల సమస్యలపై మచ్చేందర్ ఖేఢ్ సబ్ కలెక్టర్‌కు వినతి

ఉల్లి రైతుల సమస్యలపై మచ్చేందర్ ఖేఢ్ సబ్ కలెక్టర్‌కు వినతి

ఉల్లి రైతుల సమస్యలపై మచ్చేందర్ ఖేఢ్ సబ్ కలెక్టర్‌కు వినతి
January 13, 2026 02:25 PM 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఉల్లి రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఉల్లి సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీ ఖర్చులు భారీగా పెరిగినప్పటికీ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు.ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గం తరపున జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మచ్చేందర్ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మచ్చేందర్ మాట్లాడుతూ, ఇది రాజకీయ అంశం కాదని, పూర్తిగా రైతుల జీవనాధారానికి సంబంధించిన న్యాయమైన పోరాటమని తెలిపారు.ఉల్లి విత్తనాల ధరలు విపరీతంగా పెరిగినా ప్రభుత్వం ఎలాంటి భారం భరించకపోవడంతో రైతులు అప్పులపై సాగు చేయాల్సి వస్తోందన్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర అప్పుల్లో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధరలు భారీగా పడిపోయాయని, రైతుకు క్వింటాలుకు 720 రూపాయలు కూడా రావడం లేదని తెలిపారు. కనీస మద్దతు ధర ప్రకటించకపోతే ఉల్లి సాగు పూర్తిగా నష్టసాధనంగా మారుతుందని హెచ్చరించారు.అలాగే ప్రతి మండలంలో నిల్వ గిడ్డంగులు లేకపోవడం వల్ల రైతులు వెంటనే పంటను అమ్మాల్సి వస్తోందని, దీనిని దళారులు అవకాశంగా మలుచుకుని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు.ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఉల్లి కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు లేకపోతే సమాజానికి ఆహారం లేదని, రైతే దేశానికి పునాది అని స్పష్టం చేశారు.రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే నారాయణఖేడ్ రైతులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రైతుల ప్రధాన డిమాండ్లు: • ఉల్లి విత్తనాల ఖర్చును ప్రభుత్వం భరించాలి

• ఉల్లి రైతులకు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.2000 ప్రకటించాలి

• ప్రతి మండలంలో ఉల్లి నిల్వ గిడ్డంగులు ఏర్పాటు చేయాలి

• ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలు తొలగించాలి

• దళారుల దోపిడీని అరికట్టి ప్రభుత్వం నేరుగా ఉల్లి కొనుగోలు చేయాలి

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News