Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:37 AM

ఉద్యమకారుల గుర్తింపుకు అసెంబ్లీలో గళం.. మందుల సామెల్‌కు ధన్యవాదాలు.బొడ్డుపల్లి లింగయ్య

04-01-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌కు ఉద్యమకారుల కృతజ్ఞతలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌కు అసెంబ్లీ వేదికగా బలమైన స్వరం వినిపించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌కు తెలంగాణ ఉద్యమకారులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బొడ్డుపల్లి లింగయ్య ఆధ్వర్యంలో ఈ కృతజ్ఞతలు వెల్లడించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అర్హులైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని వారు కోరారు.

అలాగే ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించడంతో పాటు నెలకు రూ.25 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు తగిన గౌరవం దక్కాల్సిన సమయం ఇదేనని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి హామీలను అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

ఉద్యమకారుల గుర్తింపుకు అసెంబ్లీలో గళం.. మందుల సామెల్‌కు ధన్యవాదాలు.బొడ్డుపల్లి లింగయ్య

Article Image

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌కు ఉద్యమకారుల కృతజ్ఞతలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌కు అసెంబ్లీ వేదికగా బలమైన స్వరం వినిపించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌కు తెలంగాణ ఉద్యమకారులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బొడ్డుపల్లి లింగయ్య ఆధ్వర్యంలో ఈ కృతజ్ఞతలు వెల్లడించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అర్హులైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని వారు కోరారు.

అలాగే ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించడంతో పాటు నెలకు రూ.25 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు తగిన గౌరవం దక్కాల్సిన సమయం ఇదేనని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి హామీలను అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News