Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి

04-04-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఉన్నత చదువులు పూర్తిచేసుకున్నప్పటికీ సరైన ఉద్యోగం దొరకక మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి శివారులో రైలు కింద పడి యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.మృతుడిని చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన కొండకింది హరీష్ రెడ్డి (28)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.హరీష్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ, తగిన ఉద్యోగం రాకపోవడంతో కొంతకాలంగా తీవ్ర నిరాశలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి లోనై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Sthanikam

ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News