Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:41 AM

ఉచిత రక్తదానం పేరుతో సైబర్ మోసం… అమాయక రోగులను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు

13-05-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లాలో ఉచిత రక్తదానం సేవల పేరుతో జరుగుతున్న సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పుట్టపర్తికి చెందిన “శ్రీ సత్యసాయి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్” పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు... రోగులు మరియు వారి కుటుంబసభ్యులను మోసం చేస్తున్నారని సంస్థ నిర్వాహకులు నరేష్ , మహేశ్ పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ లో సీఐ తిమ్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. 2015 సంవత్సరం నుండి సేవలు అందిస్తున్న ఈ సంస్థ, శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహా పలు ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా రక్తదాతలను సమన్వయం చేస్తోంది. రక్తదాన సేవలతో పాటు అత్యవసర వైద్య సహాయం, ఆహార సహాయం, విద్యా సహాయం వంటి మానవతా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. అయితే ఇటీవల కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూపుల ద్వారా రోగుల వివరాలను సేకరించి, బాధితులకు నేరుగా ఫోన్ చేస్తున్నట్లు వెల్లడైంది. “రక్తదాతలను ఏర్పాటు చేస్తాం” అంటూ ప్రయాణ ఖర్చులు, భోజన ఖర్చులు, రక్తదాత ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులు అత్యవసర పరిస్థితుల్లో ఉండటంతో, ఈ కాల్స్‌ను నమ్మి UPI ద్వారా డబ్బులు పంపిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

మోసానికి ఉపయోగించిన మొబైల్ నంబర్లు:63047923148897102227

అలాగే “Mr రెడ్డి సందీప్ ” మరియు “mr.sandeep.11@superyes” పేర్లతో ఉన్న UPI ఖాతాలకు డబ్బులు బదిలీ అయినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇప్పటికే 2024 ఫిబ్రవరి 16న ఇదే తరహా మోసంపై ప్రజలకు హెచ్చరిక ఇచ్చినప్పటికీ, అదే వ్యక్తులు మళ్లీ మోసాలకు పాల్పడుతున్నారని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనల వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు డబ్బులు కోల్పోతున్నారు• ఉచిత సేవా సంస్థలపై ప్రజల నమ్మకం దెబ్బతింటోంది• నిజమైన సేవా సంస్థల ప్రతిష్టకు నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మోసం, వ్యక్తిత్వ మోసం, సైబర్ క్రైమ్ కేసుల కింద FIR నమోదు చేసి, సంబంధిత మొబైల్ నంబర్లు, UPI ఖాతాలను ట్రేస్ చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అత్యవసర రక్తదానం సేవల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలని, అధికారిక సంస్థలతో నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే స్పందించాలని నిర్వాహకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో నరేష్, మహేశ్ తో పాటు గంగాధర్ కూడా ఉన్నరు.

Sthanikam

ఉచిత రక్తదానం పేరుతో సైబర్ మోసం… అమాయక రోగులను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News