Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:45 AM

టిపిటిఎల్ఎఫ్ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

టిపిటిఎల్ఎఫ్ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

టిపిటిఎల్ఎఫ్ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ
12-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యారంగ అభివృద్ధికి ప్రైవేటు ఉపాధ్యాయుల సేవలు మరింత విస్తరించాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట:

విద్యారంగ అభివృద్ధిలో ప్రైవేటు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, వారి సేవలు భవిష్యత్ తరాలకు బలమైన పునాదిగా నిలుస్తాయని సూర్యాపేట జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ ముద్రించిన క్యాలెండర్‌ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థలు కూడా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. పరిమిత వసతులు, ఎన్నో సవాళ్ల మధ్య కూడా ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ విద్యారంగానికి విశేష సేవలు చేస్తున్నారని ప్రశంసించారు. నేటి విద్య కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ముఖ్యమని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ బోధనా పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విద్యార్థులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. టెక్నాలజీ ఆధారిత బోధనతో విద్యార్థుల అవగాహన, ఆలోచనా శక్తి మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిపిటిఎల్ఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జే. నరసింహారావు మాట్లాడుతూ, ప్రైవేటు ఉపాధ్యాయుల హక్కులు, సమస్యలు, గౌరవం కోసం ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ క్యాలెండర్ ద్వారా ఉపాధ్యాయుల్లో ఐక్యత, సంఘబలం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు ఎం. సోమరాజ్, గోపాల్ దాస్, శ్రీరాములు, టిపిటిఎల్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని శ్రీనివాస్, పాల్వయి శ్రీనివాస్, కారంగుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదాస్ కృష్ణ, కోశాధికారి డి. నాగమణి, సహాయ కార్యదర్శులు జి. రమేష్ రాజశేఖర్, కీత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టిపిటిఎల్ఎఫ్ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News